చెన్నై : భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం చెన్నై లో మర్యాదపూర్వకంగా కలిశారు. సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో మీ శైలి ప్రత్యేకమని ధోనిని మంత్రి బుగ్గన ప్రశంసించారు. చెన్నైలోని ‘ఇండియా సిమెంట్స్ లిమిటెడ్’ 75 సంవత్సరాల వేడుకలకు హాజరైన సందర్భంగా ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎన్.శ్రీనివాసన్ తో మర్యాదపూర్వకంగా ఆర్థిక మంత్రి బుగ్గన సమావేశమయ్యారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి ఎల్.మురుగన్ ను పుష్పగుచ్ఛమిచ్చి మర్యాదపూర్వకంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు.