మన రాజ్యాంగం చాలా పటిష్టమైనది
చట్టబద్దంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలి
గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
గుంటూరు : రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన ఈ కర్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు, మేధావులు, అంబేద్కర్ లాంటి మహనీయుల మార్గదర్శకత్వంలో రూపొందిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటికీ మార్గదర్శకముగా నిలబడి ఉందని ఆయన చెప్పారు.. తరువాత కాలక్రమేనా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు. భారత రాజ్యాంగం ఒక పవిత్రమైన గ్రంథం. దాన్ని అంత పటిష్టంగా రూపొందించారు కనుకనే ఈరోజు కూడా దేశ సమగ్రతకు భంగం ఏమాత్రం కలగకుండా కొనసాగుతోందని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, ఎటువంటి దుష్ట శక్తులు, శత్రువులు ఎవరూ ఏమీ చేయలేని విధంగా మన రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు జరుగుతోందని తెలిపారు. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలన్న విధానానికి ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. మన రాజ్యాంగం వల్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల జరుగుతూ ప్రభుత్వాలు మారుతున్నాయని కొనియాడారు.. ఎంతటి కుటుంబాలైనా, ఎంతటి కుటుంబమైన ఏకపక్షానికి అవకాశం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా చట్టసభలకు వెళ్లే విధంగా రాజ్యాంగ వ్యవస్థ రూపొందించడం అభిలషలనీయమన్నారు.
మన పక్క దేశం పాకిస్తాన్తో పోల్చి చూస్తే మన రాజ్యాంగం గొప్పదనం ఎటువంటిదో అర్థమవుతుందన్నారు.
మన దేశంలో ఉన్నంత పటిష్టంగా రాజ్యాంగం పాకిస్తాన్ లో లేదని చెప్పారు. రాజ్యంగాన్ని రూపొందించిన స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులు,మేధావులు, బీ,ఆర్ అంబేద్కర్ లాంటి వారు మనకి మార్గదర్శకులుగా,వీరంతా చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. ఈ రాజ్యాంగాన్ని అవసరమైన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ దాన్ని చట్టబద్ధంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు ఈ రాజ్యాంగాన్ని అందించాలన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని, అన్ని రాజకీయ పార్టీలు కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రవిచంద్ర రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, పలువురు కార్పోరేషన్ ఛైర్మన్లు,డైరక్టర్లు, పార్టీనేతలు తదితరులు పాల్గొన్నారు.