తిరుపతి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 4 ,5 తేదీలలో జిల్లాలో
పర్యటించనున్నట్లు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి పర్యటనను విజయవంతం చేయాలని
జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం
రేణిగుంట విమానాశ్రయం లో జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి జెసి డీకే బాలాజీ
జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమై భారత రాష్ట్రపతి పర్యటన
ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి
మొదటిసారిగా తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లను
చేపట్టాలని అన్నారు. ఈ నెల నాలుగున ఆదివారం సాయంత్రం విశాఖపట్నం నుండి
బయలుదేరి రాత్రి 8:40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారని అనంతరం
తిరుమల వెళ్లి బస చేస్తారని అన్నారు. ఈనెల తేది ఐదున సోమవారం ఉదయం శ్రీ
వరాహస్వామిని, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, 10 గంటలకు అలిపిరి వద్ద గల గో
మందిరం సందర్శిస్తారని, 11 గంటలకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
చేరుకొని మహిళా సాధికారికతపై స్టాల్స్ ను సందర్శించి ఇందిరా ప్రియదర్శిని
ఆడిటోరియంలో విద్యార్థినిలు అధ్యాపకులు ,ప్రొఫెసర్లతో ముఖాముఖి కార్యక్రమం
నిర్వహించనున్నారని , మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని
ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ
సీఎం కె. నారాయణస్వామి భారత రాష్ట్రపతి కి అధికారిక స్వాగతం పలకనున్నారని
తెలిపారు. భారత రాష్ట్రపతి పర్యటనలో భద్రత , వాహనాలు, అంబులెన్స్, ఫైర్
సర్వీసెస్, ఏర్పాట్లను సంబంధిత శాఖలు రాష్ట్రపతి కార్యాలయం నుండి అందిన
నిబంధనల పాటించాల్సి ఉంటుందని సూచించారు. అలాగే రాష్ట్రపతి కార్యాలయం నుండి
అనుమతించిన జాబితా మేరకు ప్రముఖులు స్వాగతం పలకనున్నారని అన్నారు. అనంతరం
రేణిగుంట విమానాశ్రయము నుండి భారత రాష్ట్రపతి ప్రయాణించనున్న ప్రదేశాలు
తిరుమల, అలిపిరి వద్ద గో మందిరం ,శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ లను
ముందస్తు వాహన శ్రేణి లో ప్రయాణించి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం
రాష్ట్రపతి పర్యటన విధులలో పాల్గొంటున్న అధికారులతో మరొకసారి సమావేశమై దిశా
నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీవి అండ్ ఎస్ ఓ నరసింహ కిషోర్, అదనపు ఎస్పి
కులశేఖర్, తిరుమల ఏ ఎస్ పి మునిరామయ్య, ఏ ఎస్ పి విమల కుమారి, ఎయిర్పోర్ట్
డైరెక్టర్ రాజ్ కిషోర్, ఆర్డీవో లు శ్రీకాళహస్తి రామారావు, తిరుపతి కనక
నరసారెడ్డి, ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్లా,
డిఎం అండ్ హెచ్ ఓ శ్రీహరి, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ డా. రామ్ , జిల్లా
ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇంఛార్జి అధికారి దయాసాగర్, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య,
డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్, సురేంద్ర, నందకిషోర్, భద్రతా సిబ్బంది ,
అధికారులు రేణిగుంట తహసిల్దారు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.