లండన్ : భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్ బాలిక మోక్షారాయ్
ప్రతిష్ఠాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును
గెలుచుకుంది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి
చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేళ్ల ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పనిచేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ఉపప్రధాని ఆలివర్ డౌడెన్
గతవారం బాలికకు అవార్డును అందజేశారు. ఆర్థిక సహకారం అవసరమైన చిన్నారులను
ఆదుకునేందుకు నిధుల సేకరణ సహా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పలు కార్యక్రమాలను
చేపట్టడం ద్వారా మోక్ష గుర్తింపు పొందారు.