ఖమ్మం : భారాసను బంగాళాఖాతంలో వేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ సమక్షంలో
కాంగ్రెస్‌లో చేరిన అనంతరం జనగర్జన సభలో పొంగులేటి మాట్లాడారు. ‘‘కేసీఆర్
తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఏ
రాష్ట్రంలో జరగని విధంగా దాదాపు 8వేల మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య
చేసుకున్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు,
నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
అధికారంలోకి రాగానే డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా రైతులు, యువతకు ఇచ్చిన
హామీలు నెరవేరుస్తాం. జనగర్జన సభకు అడ్డంకులు సృష్టించేందుకు వారం రోజులుగా
భారాస ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఇబ్బందులను తట్టుకుని అండగా నిలబడిన
కార్యకర్తలకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీనే భారాసను ఇంటికి
పంపించగలదు. లక్షలాది తెలంగాణ ప్రజలు ఇదే చెప్పారు. వారి కోరికమేరకు
కాంగ్రెస్ పార్టీలో చేరా’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.