ముందుకు వచ్చినప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. ఈ
సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఉండటం ఆ అంచనాలను మరింత
పెంచే విధంగా ఈ సినిమా కోసం ఐదుగురు హీరోయిన్లను
తీసుకోవడం, రవితేజ మొదటిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు
హింట్ ఇవ్వడంతో సినిమా మీద అందరిలోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది.ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తో౦ది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి
వస్తే శుక్రవారం నాడు నాలుగు కోట్ల 29 లక్షలు, శనివారం రెండు కోట్ల 25 లక్షలు,
ఆదివారం మరీ దారుణంగా కోటి 78 లక్షలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వసూలు
చేసింది. అలా ఎనిమిది కోట్ల 32 లక్షలు షేర్, 13 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు
చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులకు గాను తొమ్మిది కోట్ల 93
లక్షల షేర్, 17 కోట్ల 70 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి ఈ సినిమా
ఓవరాల్ బిజినెస్ 22 కోట్ల 20 లక్షలు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 23
కోట్లు నిర్ణయించారు.
సినిమా హిట్ గా నిలవాలంటే ఇంకా 13 కోట్ల ఏడు లక్షలు వసూలు చేయాల్సి ఉంది.
ఇప్పటి వరకు వసూలైన వసూళ్లతో 42 శాతం మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది.
మొదటి వీకెండ్ పూర్తి కావడంతో ఈరోజు నుంచి వీక్ డేస్ మొదలు కాబోతున్నాయి.
వీకెండ్ రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన నేపథ్యంలో
ఖచ్చితంగా వీక్ డేస్ లో కూడా గట్టి దెబ్బ పడుతుందని భావిస్తున్నారు.
ధమాకా, వాల్తేరు వీరయ్య సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న రవితేజ ఈ సినిమాతో కూడా
హిట్ అందుకోవాలని భావించాడు. కానీ దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సిన
పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో
సమంత శాకుంతలం, సహా రుద్రుడు, విడుదల వంటి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేయడం కాదు కదా దాదాపు 60 -70 శాతం రికవరీ చేయడం కూడా
కష్టమే అంటున్నారు.