సత్తెనపల్లి : ప్రజా సమస్యలపై యువగళం అనే సమర శంఖాన్ని పూరించి భావితరాల
బంగారు భవిష్యత్ కు నారా లోకేష్ బాబు పాదయాత్రతో దూసుకొస్తున్నారని, లోకేష్
గారితో పదం కలిపి, కదంతోక్కి కలిసి నడుద్దాం అని సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే
వై.వి ఆంజనేయులు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సోమవారం తెలుగుదేశం పార్టీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం సత్తెనపల్లి ఎన్టీఆర్
భవన్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా లోకేష్ బాబు “యువగళం” పాదయాత్ర విజయవంతం
కావాలని కోరుతూ స్థానిక అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న శివాలయం నందు
రుద్రాభిషేకం చేయించారు. అనంతరం ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళి
అర్పించారు.తదనంతరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు
చేసిన భారీ కేక్ ను తెదేపా శ్రేణుల సమక్షంలో కట్ చేసి లోకేష్ బాబుకి పుట్టిన
రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేక్ కటింగ్ అనంతరం ఎన్టీఆర్ భవన్ ముందు లోకేష్ బాబు జన్మ దినోత్సవాన్ని
పురస్కరించుకుని వై వి ఆంజనేయులు స్వయంగా తన చేతులతో అన్నదానం ప్రారంభించి
వడ్డించారు. రాష్ట్ర బాద్యులు చౌట శ్రీనివాసరావు, జిల్లా బాద్యులు ఆళ్ల
సాంబయ్య,బత్తుల చంద్రశేఖర్, మండల పార్టీ బాద్యులు కటకం అమర వెంకట కృష్ణ,బత్తుల
నాగేశ్వరావు, ఆళ్ల అమరేశ్వరావు, పల్లపాటి పెద్దిరాజు, రాష్ట్ర, జిల్లా తెలుగు
యువత బాధ్యులు వక్కంటి అజయ్, జోరిగే శ్రీను, ముప్పాళ్ల మాజీ ఏం పి పి పచ్చల
నాగేశ్వరరావు పోట్ల ఆంజనేయులు, బండారుపల్లి నరసింహారావు, పచ్ఛా సుధీర్,
గన్నమనేని శ్రీనివాస్, సర్వేపల్లి సీతారామాంజనేయులు, మందడి ఖాళీ, జవ్వాజి రామ్
మోహనరావు, గంగూరి వెంకటరావు,కొబ్బరి సుబ్బారావు, గజానన, అబ్బూరి రమేష్, శనగపూల
నరసింహారావు, మారెళ్ళ మల్లేశ్వరరావు, రామ లక్ష్మణ్, నోముల రమణ,మారెళ్ల
స్వామి,ఆదం, జింకా లోకేశ్వరావు, వెంకటరావు, యక్కల సుబ్బారావు,దేవతి
ప్రసాద్,మోహన్, కృష్ణ, కిళ్ళీ, సుఖమంచి నరసింహారావు, గద్దె అనురాధ, పార్టీ
శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని లోకేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలిపారు.