మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
విశాఖపట్నం : భూకబ్జాదారులను జైలుకు పంపించేదాకా తెలుగుదేశం పార్టీ పోరాటం
చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
తెలిపారు. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం, చింతకట్ల ప్రాంతాల్లో బండారు
సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ‘ఇదేమీ ఖర్మ-రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రెండు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్
ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి బైక్ నడిపి టీడీపీ
శ్రేణులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.