తాజా చారిత్రాత్మక బ్లాక్బస్టర్ ‘భూల్ భూలయ్యా 2 తర్వాత నటుడు కార్తీక్ ఆర్యన్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ‘భూల్ భూలయ్యా-2 విజయం తర్వాత ఆయన ఆరెంజ్ మెక్లారెన్ GT అనే లగ్జరీ స్పోర్ట్స్ కారును బహుమతిగా అందుకున్నాడు. అలాగే ఓ యాక్షన్ వీడియోను కార్తీక్ ఆర్యన్ ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే GQ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులలో 2022 సంవత్సరానికి గాను బెస్ట్ ఎంటర్టైనర్గా కార్తీక్ అవార్డు దక్కించుకున్నాడు. అవార్డు కు ఎంపిక కావడంపై సినీ ప్రముఖులు కార్తీక్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “బహుత్ బహుత్ బాధై హో [అభినందనలు]” అని నటుడు రోనిత్ బోస్ రాయ్ ఇన్స్టాగ్రామ్లో కార్తీక్ను అభినందించాడు.