నెల్లూరు : జిల్లాలో మంజూరైన సాగునీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్,
అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ హరి
నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్ తో కలసి జిల్లాలో మంజూరైన
నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత
అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ -1, ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన
భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ
ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ, డికేటి, చుక్కల భూముల భూ సేకరణ ప్రక్రియ పై
నిర్ధిష్టమైన గడువును నిర్దారించుకొని ఆ గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి
చేసేలా దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ, సంబంధిత ప్రాజెక్టు ఇంజనీరింగ్
అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా
చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో
తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్.ఈ హరినారాయణ రెడ్డి, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్
వేంకటేశ్వర రావు, తెలుగు గంగ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.