విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్యర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకలలో టీడీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. వేడుకలను నిర్వహించిన అనంతరం
భోగి మంటల్లో జీవో నెంబర్ కాపీలను వేసిదగ్ధం చేశారు. విజయవాడలోని టీడీపీ
అధ్వర్యంలో భోగి మంటలు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,
ఎమ్మెల్సీ అశోక్ బాబు ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. గొల్లపూడి వన్ సెంటర్లో
భోగి వేడుకలలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. మచిలీపట్నంలో
మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో జీవో నెంబర్ వన్ కాపీలను భోగి మంటల్లో
వేసి తగలబెట్టారు. పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ
నేతలు భోగి మంటలు వేశారు. భోగి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలలో టీడీపీ
శ్రేణులు పాల్గొన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో భోగి మంటల్లో జీవో నెంబర్ వన్
కాపీలను టీడీపీ ఆధ్వర్యంలో కాల్చివేశారు. వీటితో పాటు టీడీపీ నేతలపై పెట్టిన
తప్పుడు కేసుల ఎఫ్ఐఆర్ కాగితాలనూ భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నేత బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాల చీకటి పాలన పోయి
మంచి పాలన రావాలని అర్జునుడు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
జీవో నెంబర్ వన్ కాపీలను.. భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో
సీపీఐ నేత రామకృష్ణ పాల్గొన్నారు.