అమరావతి : రాష్ట్ర రాజధాని ముఖద్వారంగా ఉన్న మంగళగిరి నగరంలో అమరావతి ప్రెస్
క్లబ్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం సెంటర్ కు
సమీపంలోని మండలపరిషత్ కార్యాలయం ఎదుట జ్యోతి ఎలక్ట్రానిక్స్ పైన సెకండ్ ఫ్లోర్
(పాత సిటీకేబుల్ ఆఫీసు)లో అమరావతి ప్రెస్ క్లబ్ ను ముఖ్యఅతిథిగా హాజరైన
సీనియర్ పాత్రికేయులు చెవుల కృష్ణాంజనేయులు ప్రారంభోత్సవం చేశారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉండే జర్నలిస్టులకు సంబంధించి
ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్, హెల్త్ కార్డులు వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర
రాజధాని కేంద్రంగా అమరావతి ప్రెస్ క్లబ్ భవిష్యత్తులో కేంద్రబిందువుగా
ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల
స్థలాల కేటాయింపు ప్రక్రియలను రాష్ట్రప్రభుత్వం త్వరతిగతిన పూర్తిచేయాలని ఈ
సందర్భంగా ఆయన కోరారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు, అలాగే
బీమా సౌకర్యాన్ని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని కృష్ణాంజనేయులు
డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చెవుల కృష్ణాంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్ లు కె
నాగశివ ప్రసాద్, అవ్వారు శ్రీనివాసరావు, కూరపాటి మురళీ రాజులను దుశ్రాలువాతో
సన్మానించారు. అమరావతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమరావతి ప్రెస్
క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మట్టుకొయ్య కృష్ణ, దామర్ల ఆన్వేష్, ఉపాధ్యక్షులు
నువుల శ్రీహరి, సీనియర్ జర్నలిస్ట్ లు మంచికలపూడి శిరిబాబు, ఎన్ వి
శివన్నారాయణ, శిరందాసు నాగార్జున, బండారు సాంబశివరావు, మెడకాయల మస్తాన్ రావు,
ఉద్దంటి రమేష్, కొనేటి వెంకటేష్, అన్నవరపు ప్రభాకర్, వీడేలా వాసు, పలువురు
జర్నలిస్టులు పాల్గొన్నారు.