సెల్పీలు..యువతతో మాటామంతీమంగళగిరి పట్టణంలో సాయంత్రం వేళ యువగళం ప్రతిధ్వనించింది. అనుకోని
అతిథి పలకరింపులతో పులకరించింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ అకస్మాత్తుగా ఆల్ఫా హోటల్ ఏరియాలో కాన్వాయ్ దిగారు. వెళ్తూనే ఆ
ప్రాంతంలోని రెస్టారెంట్లో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చారు. వేడి వేడి ఇడ్లీ వచ్చేలోపు
తన టేబుల్ ఎదురుగా ఉన్న ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ తో మాట కలిపారు. 20
నిమిషాలకు పైగానే రాష్ట్రంలో ఐటీకి పరిస్థితి, వారి ఉద్యోగం, స్థితిగతులు,
ఉద్యోగావకాశాలపై చర్చ సాగింది. ఈ లోగా నారా లోకేష్ అక్కడున్నారని తెలిసిన
యువత పెద్ద ఎత్తున చేరుకున్నారు. సెల్ఫీల సందడి ఆరంభమైంది. ఇడ్లీ తిని
వారికి బిల్లు చెల్లించి, టీ స్టాల్ దగ్గరకొచ్చి ఇరానీ టీ తాగారు.
యజమానులతో మాటలు కలిపారు. మంగళగిరిలో లోకేషే గెలుస్తారని తమ హోటల్
కి వచ్చేవారు రోజూ అనుకుంటున్నారనే సంగతి వారు యువనేతకి చెప్పి సంతోషం
వ్యక్తంచేశారు. ఆల్ఫా సెంటర్లో లోకేష్ సందడి చేస్తున్నారని యువత గుంపులు
గుంపులుగా తరలివచ్చారు. ఇదే సమయంలో ఈ ఒక్క ఏరియాలో పవర్ కట్ చేశారు.
దీని వెనుక పవర్ ఎవరిదో తెలిసిన నారా లోకేష్ చిరునవ్వు నవ్వారు. అంతలోనే
అందరి సెల్ఫోన్ల లైట్లూ వెలిగాయి. తాను నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ
ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. పాన్ షాప్ వారితో మాటలు కలిపారు. అక్కడ
సిగరెట్లు తాగుతున్న యువతతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చారు.
మెరుపులా దిగి…నవ్వులు పంచి…యువగళాల మనోగతాలను ఆలకించిన నారా
లోకేష్ ని యూత్ శెహభాష్ అని ప్రశంసించారు.