సురక్ష క్యాంపు ద్వారా 11 రకాల ధృవీకరణ పత్రాలు
మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ : స్థానిక భవాని పురం లో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ
సమావేశంలో వెలంపల్లి మాట్లాడుతూ ఒక మంచి లక్ష్యంతో జగన్న సురక్ష కార్యక్రమం
చేపట్టాం అన్నారు. వాలంటరీ సచివాలయం సిబ్బందితో ప్రజల వద్దకు ప్రభుత్వ
కార్యకలాపాలు చేరువ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఒక్కో డివిజన్ లో ఒక
క్యాంప్ పెడుతున్నామని తెలిపారు. శనివారం కేదారేశ్వర పేట మ్యాంగో మార్కేట్
కళ్యాణ్ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏదైనా ధృవీకరణ పత్రం
కావాలంటే ఏళ్ల తరబడి తిరగాలని, నేడు ఇంటి ముంగిట్లో ఇస్తున్నామన్నారు. ప్రతి
ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా15 వేల క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు
ఒంకలతో పథకాలు అపేసేవాడన్నారు. నేడు జగన్ మోహన్ రెడ్డి అందరికీ అన్నీ సంక్షేమ
పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అభ్యర్ధులపై ఓడిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్
అని గుర్తుచేశారు. చేతకాని మాటలు మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు.