గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
చేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. అంబటి నేతృత్వంలో ‘వైఎస్సార్
సంక్రాంతి లక్కీ డ్రా’ పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు
అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వయంగా
మంత్రి అంబటి కూడా లాటరీ టికెట్లు అందరూ కొనాలని బహిరంగంగా ప్రకటించారని
ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందుతున్న
లబ్ధిదారులే లక్ష్యంగా టికెట్లు విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై
సత్తెనపల్లి కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన నేత గాదె
వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి అంబటి లాటరీ టికెట్ల కోసం చేసిన
ప్రచార వీడియోను కోర్టుకు సమర్పించారు. రాష్ట్రంలో లాటరీ వ్యాపారానికి అనుమతి
లేకపోయినా బహుమతుల పేరిట టికెట్లు విక్రయిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు
చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు విచారించిన న్యాయమూర్తి అంబటిపై
తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.