పూలమాల వేసి నివాళులు
కరీంనగర్ : ఇటీవల మృతి చెందిన మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య దశ
దినకర్మకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి
హెలికాప్టర్లో కరీంనగర్ చేరుకున్న సీఎం ముందుగా మంత్రిని పరామర్శించారు.
అనంతరం ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరీంనగర్
జిల్లా కేంద్రంలోని కొండసత్యలక్ష్మి గార్డెన్లో మంత్రి గంగుల కమలాకర్ తండ్రి
దశదినకర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి
హెలికాప్టర్లో కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి
ప్రత్యేక వాహనంలో కేఎస్ఎల్ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ మంత్రి గంగుల
తండ్రి గంగుల మల్లయ్య దశదినకర్మలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి
ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లయ్య కుమారులైన మంత్రి గంగుల కమలాకర్,
ఆయన సోదరులు గంగుల వెంకన్న, సుధాకర్‌లతో పాటు కుటుంబసభ్యులను కేసీఆర్
పరామర్శించారు. సీఎం వెంట ఎంపీ సంతోశ్‌కుమార్, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి,
కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్,
ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్‌రావు తదితరులు
ఉన్నారు. పెద్దకర్మ అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి స్పోర్ట్స్ స్కూల్‌కు
చేరుకుని హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.