అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ…అప్పుదోవ పట్టిస్తున్నారు
ఆందోళన వ్యక్తం చేసిన ఎపిఎంఎస్ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి
అమరావతి : ఆస్పత్రులకు మందుల కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలూ జరగలేదని
ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఎపిఎంఎస్ఐడిసి)
మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.మురళీధరరెడ్డి ఐఎఎస్ నేడొక ప్రకటనలో తెలిపారు.
మార్కెట్ ధర కంటే 500% పైగా అధికం అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని
ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే దురుద్దేశంతోనే ఇటువంటి
అసత్య ఆరోపణలతో కూడిన ప్రచారం జరగడం దురదృష్టకరమన్నారు. కావాలనే కొంతమంది
పనిగట్టుకుని ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం
చేశారు. రెండేళ్ళ లో రూ. 100 కోట్ల మేర విక్రయాలు జరిగాయనడం తప్పదోవ
పట్టించేలా వుందనీ, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్ ల ద్వారా గానీ , ఎపిఎంఎస్
ఐడిసి ద్వారా గానీ ఇప్పటి వరకూ ఎటువంటి చెల్లింపులూ జరగలేదనీ ఆయన స్పష్టం
చేశారు. ఒక్కరూపాయి కూడా చెల్లించనప్పుడు రూ.100 కోట్ల మేర దోపిడీ ఎలా
జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఔషధాలు కొనే విషయంలో బోధనాసుపత్రులలో కొన్ని
ఔషధాలు అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ కోసం గానీ , ఇతర తక్కువ స్థాయిలో గానీ
అవసరమైనటు వంటివి ఉంటాయని వివరించారు. డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా
ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు 20 శాతం సబ్సిడీ కిగాను గతంలో ఔషధాలు కొనుగోలు
చేసేవారనీ, ఈ విషయం ప్రభుత్వ ద్రుష్టికి రావటంతోపాటు కొనుగోళ్లలో జాప్యం
జరగడం , రేట్లలో వ్యత్యాసాలు ఉండడం వంటి పరిస్థితులు నెలకొనడం వల్ల
సెంట్రలైజ్డ్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చామనీ వివరించారు. టెండర్లో పెట్టిన
నిబంధన ప్రకారమే ఏ ఔషధాన్నయినా గుత్తేదారు సరఫరా చేయాల్సి వుంటుంన్నారు.
అత్యవసర మందుల సరఫరాలో జాప్యాన్ని అధిగమించేందుకు మరియు అత్యవసర రోగుల
ప్రాణాలను కాపాడాన్ని దృష్టిలో ఉంచుకొని , అన్ని భోధనాస్పత్రులు ,
జిల్లాఆస్పత్రుల సూపరింటెండెంట్ ల విజ్ఞప్తి అనంతరం ప్రభుత్వ ఆదేశాలమేరకు
ఏపీఎంఎస్ఐడీసీ రెండేళ్లకు ఈ ప్రొక్యూర్మెంట్ ధ్వారా ఆన్లైన్ మరియు రివర్స్
టెండరింగ్ నిర్వహించి అతితక్కువ రేట్లకు మందులు సరఫరా చేసే ఏజెన్సీని
గుర్తించడం జరిగిందన్నారు. సరఫరాదారుడి అన్ని బిల్లులను డ్రగ్ కంట్రోల్
అథారిటీ వారి పరిశీలన తర్వాత , వారు నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా బిల్లులు
చెల్లించటం జరుగుతుందని వివరించారు. అత్యవసరమైతే ఆరు గంటల్లోపూ , రెగ్యులర్
డ్రగ్స్ అయితే 24 గంటల్లోపూ, బల్క్ గా అయితే 7 రోజుల్లోగా ఆసుపత్రులకు ఔషధాలు
సరఫరా చేయాల్సి వుంటుందన్నారు. ఎంఆర్పీ కంటే డిస్కౌంట్ రేటుకు సరఫరా చేయాల్సి
వుంటుందని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు ఎమ్మార్పీ కంటే
తక్కువ ధరకు సరఫరా చేస్తున్నదీ లేనీదీ ఎపిఎంఎస్ ఐడిసి పరిశీలన చేస్తుందనీ,
తప్పుడు క్లెయిములేవైనా వున్నట్టు తమ దృష్టి కొస్తే చెల్లింపుల్లో కోత
విధిస్తామని వివరించారు. వ్యత్యాసం ఉన్న రేట్ల మొత్తాన్ని, లేటుగా సరఫరాచేసే
అలాగే సరఫరాచేయని తయారీదారుల బిల్లుల నుండి ఏపీఎంఎస్ఐడీసీ రికవరీ చేస్తుందనీ,
కనుక పైన తెలిపిన అన్ని నిబంధనల ప్రకారం , ఎక్కడా ప్రభుత్వ ఖజానాకు నష్టం
వాటిల్లే అవకాశమే లేదన్నారు. అత్యవసర మందులు సమయానికి అందుబాటులో ఉంచి
పేదప్రజల ప్రాణాల్ని కాపాడడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమనీ ఆయన గుర్తు చేశారు .
గతంలో అన్ని భోధనాస్పత్రులు , జిల్లాఆస్పత్రులు వారి – వారి రేట్
కాంట్రాక్టులు ఉండేవని, వారు తమ తమ పరిధిలో అత్యధిక రేట్లకు కొనుగోలు
చేసేవారని ఆయన వివరించారు. గతంలో వికేంద్రీకృత బడ్జెట్ తో అత్యధిక రేట్లకు
కొనుగోలు చేసిన విషయం ప్రభుత్వ ద్రుష్టికి వచ్చిందన్నారు. ఈ కారణంగానే
ఎపిఎంఎస్ఐడిసి ద్వారా కేంద్రీకృత టెండర్ ను ఆహ్వానించటం ద్వారా ఒకే సంస్థకు
మందుల సరఫరా బాధ్యతను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ , వాస్తవానికి
అప్పటి రేట్ల కంటే ఇప్పటి రేట్లు ఎన్నో రెట్లు చాలా తక్కువగా ఉన్నాయని,
అన్ని అత్యవసర మందులు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచామని ఆయన స్పష్టం చేసారు.
ముఖ్యంగా ఆస్పత్రులలో శస్త్రచికిత్సల సమయంలో అత్యవసరంగా వినియోగించే మందులను
తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసి అందుబాటులో వుంచుతామని తెలిపారు. ఇందువల్ల
ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను ప్రభుత్వం కాపాడగలిగిందన్నారు. ప్రత్యేకంగా
బోధనాస్ప్రతులలో ఇటువంటి అవసరాలు ఏర్పడతాయన్నారు. నిబంధనల ప్రకారం సరఫరాదారుడు
జనరిక్ మందులను , బ్రాండెడ్ మందులను , కేంద్రప్రభుత్వ డ్రగ్ ప్రైస్ కంట్రోల్
మందులను ఒకే రాయితీ రేట్లకు సరఫరా చెయ్యాల్సి వుంటుందని తెలిపారు. ఈ మందులలో
60 శాతానికి పైగా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ వారి ఆధీనంలో ఉన్న మందులు కూడా
ఉన్నాయన్నారు. వీటి గరిష్ట రిటైల్ ధరలు కేంద్రప్రభుత్వ నిబంధనలకు లోబడి
ఉంటాయని వివరించారు. రోగియొక్క అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ,
నిర్ణీత సమయంలో సరఫరాదారుడు అత్యవసర మందులను ఆస్పత్రులకు అందించవలసి
ఉంటుందని,దీనితో 20 శాతం వికేంద్రీకృత బడ్జెట్ నిధులతో ఆయా స్థాయిల్లో
స్థానికంగానే కొనుగోలు చేసే వారని వివరించారు. ఇప్పుడు ఎపిఎంఎస్ఐడిసి ఆ
నిర్ణీత సమయంలోనే అందుబాటులో ఉన్న కంపెనీల నాణ్యమైన మందులు సరఫరా చేయడం
జరుగుతుందని తెలిపారు. సరఫరాదారుడు అన్ని మందులను నిబంధనలకు లోబడి మొదటిగా
జనరిక్ మందులను , జనరిక్ మందులు దొరకని పక్షంలో బ్రాండెడ్ మందులను ఆరు
గంటలలోపు సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. సరఫరాదారుడు జనరిక్ మందులను ,
బ్రాండెడ్ మందులను , కేంద్రప్రభుత్వ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ మందులను ఒకే రాయితీ
రేట్లకు సరఫరా చెయ్యాల్సి వుంటుందన్నారు. మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకునే
చెల్లింపులు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మందులలో 60 శాతానికి పైగా డ్రగ్ ప్రైస్
కంట్రోల్ వారి ఆధీనంలో ఉన్న మందులు కూడా ఉన్నాయనీ, వీటి ధరలు కేంద్రప్రభుత్వ
నిబంధనలకు లోబడి ఉంటాయనీ ఆయన వివరించారు. ముగ్గురు టెండరుదారులు పోటీ లో
పాల్గొన్నారనీ , రివర్స్ బిడ్డింగ్ వల్లే రేటు కాంట్రాక్టు తగ్గిన విషయాన్ని
గమనించాలన్నారు. సరఫరా దారుడుకి స్థాయి ఉండాలనే ఉద్దేశంతోనే రూ.10 కోట్లుగా
నిర్ణయించామన్నారు.