మచిలీపట్నం : మచిలీపట్నంలో పంద్రాగస్ట్ వేడుకలు అంబరాన్ని అంటాయి. పోలీస్
పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా
ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ జరిపారు.
పతాకావిష్కరణ అనంతరం సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేకంగా
అలంకరించిన వాహనం ద్వారా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా పోలీస్
సూపరింటెండెంట్ పి జాషువాతో కలిసి మంత్రి రోజా పెరేడ్‌ను పరిశీలించారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి స్వాతంత్ర్య
దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ డా. అపరాజిత
సింగ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాము, వివిధ శాఖల అధికారులు
పాల్గొన్నారు.