ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు
అమరావతి : ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైయస్.జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన్ని గుర్తుంచుకుంటారని అన్నారు. మచ్చలేని వ్యక్తిత్వం హరిచందన్ సొంతమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను దాటుకుని రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి మరువలేని సహకారాన్ని అందించారన్నారు. అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా, నిండైన హుందాతనంతొ వ్యవహరించారని, అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపించారన్నారు. రాష్ట్రం- కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలో, వాటి సంబంధాలు సజావుగాసాగడంలో అత్యంత కీలకపాత్రపోషించి, రాజ్యాంగానికి వన్నెతెచ్చారన్నారు. తండ్రివాత్సల్యాన్ని చూపారని, ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఆయన వెళ్లిపోవడం బాధాకరమైనా, దేశంలో మరో రాష్ట్రానికి ఆయన గవర్నర్‌గా వెళ్లడం అక్కడి ప్రజలకు తప్పకుండా మేలుచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.