ఇంఫాల్ : మణిపుర్లో శాంతి ప్రక్రియకు మరోసారి విఘాతం కలిగింది. అక్కడ జరిగిన
కాల్పుల ఘటనలో మరణాలు చోటుచేసుకున్నాయి. జాతుల మధ్య ఘర్షణలతో చెలరేగిన హింస
కారణంగా కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఆ
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
చేస్తోన్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ మరోసారి చోటుచేసుకున్న
కాల్పుల ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ మహిళ కూడా
ఉందని సమాచారం. పలువురు గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంఫాల్
తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్ ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఉగ్రవాదులు,
గ్రామ వాలంటీర్ల మధ్య సోమవారం రాత్రి వరకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన
కారణంగా తొమ్మిది మంది మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని తెలుస్తోంది. అయితే
దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం రాలేదు. గాయపడిన వారిని దగ్గర్లోని
ఆసుపత్రుల్లో చేర్చారు. దాంతో కర్ఫ్యూ అమలు చేస్తోన్న సమయం మరింత పెరిగింది.
ఆంక్షల సడలింపులకు కోత పడింది.

మణిపుర్ గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా
కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన
చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దాంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర
ఆందోళనకు గురవుతున్నారు. వారి కలవరపాటు రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలకు
దారితీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర
హోం మంత్రి అమిత్ షా శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. పౌరుల మధ్య సామాజిక
ఐక్యత, పరస్పర అవగాహనను శాంతి కమిటీ బలోపేతం చేస్తుందని హోంశాఖ తెలిపింది.
జాతుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది. సోమవారం రాత్రి జరిగిన
కాల్పులు ఘటనతో ఈ ప్రక్రియకు విఘాతం కలిగింది.