డ్రగ్స్ ఫ్రీ అవగాహన ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
విశాఖపట్నం : విశాఖపట్నంలో మత్తు పదార్థాలు నివారించడానికి అన్ని వ్యవస్థలు
సమిష్టిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున సూచించారు.
మత్తు పదార్థాల నివారణలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సమర్థవంతగా కృషి
చేస్తుందని, ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మరిన్ని మెరుగైన ఫలితాలు
వస్తాయన్నారు. జూన్ 26న జరిగే డ్రగ్ ఫ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్ పోస్టర్ ను
కలెక్టర్ మల్లికార్జున విడుదల చేశారు. సాయంత్రం సమయంలో దాడులు పెంచడం ద్వారా
మత్తు పదార్థాలు వినియోగాన్ని అరికట్టే విధంగా మరింత సమర్థంగా పనిచేయాలని
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో
విశాఖపట్నం ఎస్ ఈ బీ డిప్యూటీ కమిషనర్ బాబ్జి రావు, జాయింట్ డైరెక్టర్ బమ్మిడి
శ్రీనివాసరావు, ఏ ఈ స్ బి శ్రీ నాథుడు, వినీషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.