నిన్న ఉదయం తుదిశ్వాస విడిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి తల్లి
మద్దాలి నివాసానికి వెళ్లిన జగన్
శివపార్వతి చిత్రపటానికి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి
గుంటూరు : వైసీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఆయన కుటుంబ సభ్యులను
ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. నిన్న ఉదయం గిరి తల్లి శివపార్వతి (68)
గుండెపోటుతో మృతి చెందారు. ఆమె భౌతిక కాయానికి మంత్రులు విడదల రజని, మేరుగు
నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు నివాళి
అర్పించారు. ఈరోజు మద్దాలి నివాసానికి వెళ్లిన జగన్ ఆయన తల్లి చిత్రపటానికి
నివాళి అర్పించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని
ఓదార్చారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.