న్యూజిలాండ్ : ఆమె ఓ దేశ న్యాయశాఖ మంత్రి. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేస్తూ
ప్రమాదానికి కారణమయ్యారు. అక్కడికి చేరుకొన్న పోలీసులు బ్రీతింగ్ పరీక్ష
నిర్వహించగా ఆమె మోతాదుకు మించి మద్యం తాగినట్లు గుర్తించారు.ఈ క్రమంలో ఆమెను
అరెస్టు చేయబోగా.. తీవ్రంగా ప్రతిఘటించారు. కానీ, పోలీసులు ఎట్టకేలకు అరెస్టు
చేశారు. విషయం గుప్పుమనడంతో చివరికి పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన
న్యూజిలాండ్‌లో చోటు చేసుకొంది. న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్
ఆదివారం రాత్రి మద్యం తాగి కారును అతివేగంగా నడిపారు. దీంతో ఓ పార్కింగ్లోని
వాహనాలను ఆమె కారు ఢీకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరీక్షించగా ఆమె
మద్యం తాగినట్లు తేలింది. దీనికి తోడు ఆమె అరెస్టుకు సహకరించలేదు. చివరికి
ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి నాలుగు గంటలపాటు ఉంచారు. తాజాగా ఆమె
కోర్టులో కేసును ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె సోమవారం పదవికి రాజీనామా
చేశారు.