ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువవుతుంది. అయితే
షుగర్ పేషెంట్లు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. అందులోనూ
పండ్లు తినే సమయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు
ఏ పండ్లు తినకూడదో చూద్దాం..
పుచ్చకాయ:
పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్
తొందరగా పెంచుతుంది. అందువల్ల షుగర్ పేషెంట్లు ఈ పండు తినడం మంచిది కాదు.
అరటి పండు:
అరటి పండినా కొద్దీ వాటిలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల బాగా
పండిన అరటి పండ్లను తినకపోవడమే మంచిది.
చెర్రీస్:
స్వీట్ చెర్రీస్ లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని కూడా
మితంగా తినడం మంచిది. ఎక్కువ మోతాదులో తింటే సమస్యలు వస్తాయి.
పైనాపిల్:
పైనాపిల్ రుచికి తియ్యగా ఉంటుంది. అందువల్ల దీనిని కూడా షుగర్ పేషెంట్లు
తినకపోవడమే మంచిది. కొందరు పైనాపిల్లో చక్కెర కలుపుకుని తింటారు. ఇది అస్సలే
మంచిది కాదు.
మామిడి:
వేసవిలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను మితంగా తీసుకోవడం అవసరం. వీటిని
ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. జాగ్రత్త.
డ్రై ఫ్రూట్స్:
పండ్లను ఎండబెట్టడం ద్వారా తయారయ్యే డ్రై ఫ్రూట్స్ లో షుగర్ గాఢత ఎక్కువగా
ఉంటుంది. ఎందుకంటే ఆ పండ్ల నుంచి నీరు పూర్తిగా తొలగిపోతుంది. అందువల్ల వీటిని
కూడా తినకూడదు.
పనస:
పనస పండులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్
పెంచుతాయి. అందువల్ల షుగర్ పేషెంట్లు ఈ పండుని తినకూడదు.