ఆరోగ్యం పాడవుతుంది. మధ్యాహ్న భోజనంలో ఏం తినకూడదు అంటే..?
* ఒక రోజు ముందువి:
చాలామంది ముందురోజు మిగిలిపోయిన కూరలు, బిర్యానీలాంటివి లంచ్ లోకి తింటుంటారు.
అయితే వీటిలోని ఆయిల్, మసాలాల వల్ల అవి పాడైపోతాయి. ఇది ఎసిడిటీ వంటి
జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతుంది.
* వేపుడు పదార్థాలు:
వేయించిన ఆహారాలను కూడా మధ్యాహ్న సమయంలో తినకూడదు. ఇలాంటి ఆహారం తింటే బద్ధకం
ఆవహిస్తుంది. జీర్ణం కావడానికి కూడా సమయం పడుతుంది.
* సలాడ్స్:
సలాడ్స్ కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి మీకు కావాల్సిన పోషకాలను
అందించలేవు. అందువల్ల లంచ్ లోకి సలాడ్స్ తీసుకోకపోవడమే మంచిది.
* పండ్లు:
లంచ్ సమయంలో పండ్లు తినడమనేది మంచి ఆలోచన కాదు. లంచ్ చేయడానికి ముందు పండ్లు
తినడం మంచిదే కానీ.. లంచ్ కి మాత్రం తినొద్దు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు
వస్తాయి.
* ప్రాసెస్డ్ ఫుడ్స్:
పాస్తా, పిజ్జా, బర్గర్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా లంచ్‌లోకి తినకూడదు.
వీటిలో పోషకాలు ఉండకపోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
* స్మూతీస్:
ఉదయాన్నే స్మూతీస్ తీసుకోవడం మంచిది. కానీ లంచ్ సమయంలో మాత్రం ఇలాంటివి
ముట్టుకోవద్దు. దీనివల్ల తొందరగా జీర్ణమై ఆకలి ఎక్కువ అవుతుంది.
* శాండ్ విచ్:
శాండ్ విచ్ కూడా లంచ్‌లోకి తినకూడదు. వీటిలో పోషకాలు కానీ కేలరీలు కానీ అస్సలు
ఉండవు. దీనివల్ల మీరు వీటిని తినడం వల్ల శక్తి లభించదు.
* స్వీట్ ఫుడ్స్:
కేక్స్, పేస్త్రీ వంటి వాటిని కూడా లంచ్ సమయంలో తినకూడదు. వీటిలోని అధిక
కేలరీలు, చక్కెర వల్ల బాడీలో కొవ్వులు పేరుకుపోతాయి. బరువు పెరుగుతారు.