చేయాలి
సమాజ సేవకోసం యువత రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలి
దేశంలో కొన్ని విచ్ఛిన్న శక్తులు, రాజకీయ పార్టీలు హిందూ, ముస్లిం, క్రైస్తవుల
మధ్య చిచ్చు పెట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలన్న ఎత్తుగడలు
ఏలూరు షాహ్రీ జమియాత్ అహ్లే హదీస్ ఆధ్వర్యంలో దీనీ ఇజితిమా ధార్మిక సభ
ఏలూరు : మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని దైవ గ్రంథాలు వెలిగెత్తి
చెబుతున్నాయని అబ్దుల్ హసీబ్ ఉమ్రి మదని అన్నారు. జమియ్యత్ అహ్లెహదీస్ ఏలూరు
శాఖ ఆధ్వర్యంలో “మనమంతా ఒక్కటే మన అందరి సృష్టి కర్త ఒక్కడే” అనే అంశంపై ఒక
ధార్మిక సభ స్థానిక టొబాకో మర్చంట్ కళ్యాణ మండపం లో నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి నా హసీబ్ మదని ప్రసంగిస్తూ మనుషులు తమ
స్వార్ధ ప్రయోజనాల కోసం దైవ గ్రంథంలో ఉన్న విషయాలను కప్పిపుచ్చి మనిషిని
భయభ్రాంతులకు గురిచేసి సృష్టి రాశులను పూజించే విధంగా వలయం ఏర్పాటు
చేశారన్నారు. ప్రతి మనిషి అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ ను అంతిమ దైవ ప్రవక్త
మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను చదివి అర్థం చేసుకొని
ఆచరించాలని ఈ సందర్భంగా కోరారు. నేటి సమాజంలో యువకులందరూ మహా ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం నైతిక విలువలు కలిగి ఉండాలని, సమాజ సేవకోసం యువత
రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. సభ అధ్యక్షులు జమ్మియతే అహలే హదీస్
రాష్ట్ర అధ్యక్షులు ఫజలుర్రహ్మాన్ ఉమ్రీ ప్రసంగిస్తూ మనమంతా ఖుర్ఆన్, హదీసు
అనుగుణంగా జీవితం గడపాలని కోరుతూ సమాజంలో శాంతి ప్రేమను పంచుతూ ఒక భారతీయుడిగా
దేశం, సమాజం కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. దేశంలో కొన్ని విచ్ఛిన్న
శక్తులు, రాజకీయ పార్టీలు హిందూ ,ముస్లిం , క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి
అధికార పీఠం కైవసం చేసుకోవాలన్న ఎత్తుగడలు వేసి సఫలీకృతులవుతున్నారని రానున్న
రోజుల్లో వారి ఆటలు సాగకుండా అందరం కలిసి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఏదైనా ఆపద వస్తే ముస్లింలు ముందుండి ప్రజలను రక్షించడంలో తమ ప్రాణాలకు
సైతం లెక్కచేయకుండా సహాయం చేసిన సందర్భాలలో కరోనా ఒకటిని గుర్తు చేశారు. కరోనా
సమయంలో ఉచిత మందులు ఆహారంతో పాటు మృతి చెందిన హిందువులు, క్రైస్తవులకు, వారి
సాంప్రదాయాల ప్రకారం గా అంతిమ సంస్కారాలు చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో
మానవత్వాన్ని నిలబెట్టాలని కోరారు.