సల్మాన్ ఖాన్ హీరోగా సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘కిక్’
బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘కిక్’
లేకపోతే జీవితంలో వినోదం ఉండదు’ అంటూ అలరించారు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత
‘కిక్ 2’ సినిమాతో మరింత కిక్కు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు దర్శకుడు. తాజాగా
ఆ చిత్ర విషయాలను సాజిద్ ప్రకటిస్తూ త్వరలోనే ‘కిక్2’ సినిమాతో మీ ముందుకు
వస్తున్నాము. కథ సిద్ధంగా ఉంది. కానీ, కొంచెం సమయం పడుతుంది. చిత్రీకరణకు చాలా
రోజులు పడుతుంది. విడుదలకు కూడా సరైన సమయం కావాలి. నేను ఈ సినిమా తీయడానికి
రెడీగా ఉన్నాను. సల్మాన్ కూడా కథ విన్నారు. ఈ సినిమా పట్ల అభిమానులు ఎంత
ఆసక్తితో ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. దానికి తగిన విధంగా ఈ చిత్రానికి
సన్నాహాలు చేస్తాం అని అన్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్ 3’ చిత్రంలో
కత్రినా కైఫ్ తో కలిసి సందడి చేయనున్నారు.