ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో గత ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. నంద్యాల జిల్లా అవుకులోని తన స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకె ళ్లారు. రెండు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు . ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్త స్రావం అవుతుండటంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయన్ను కాపా డేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ బంధువు చల్లా రఘునాథరెడ్డి మాట్లాడుతూ… భగీరథ రెడ్డికి వెంటిలేటర్ పై తొ లుత 100 శాతం ఆక్సిజన్ ఇచ్చారని, ప్రస్తుతం 60 శాతానికి తగ్గించారని, శరీరం చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు.