వాషింగ్టన్ : అమెరికాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు రూపొందించిన
‘మోస్ట్ వాంటెడ్ లిస్ట్’లో తన పేరు లేదంటూ పరారీలో ఉన్న ఓ నేరస్థుడు
ఫేస్బుక్ వేదికగా కామెంట్ పెట్టాడు. అంతే దీని ఆధారంగా పోలీసులు అతన్ని
అరెస్టు చేయడం గమనార్హం అమెరికాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు
రూపొందించిన ‘మోస్ట్ వాంటెడ్ లిస్ట్’లో తన పేరు లేదంటూ పరారీలో ఉన్న ఓ
నేరస్థుడు ఫేస్బుక్ వేదికగా కామెంట్ పెట్టాడు. అంతే దీని ఆధారంగా పోలీసులు
అతన్ని అరెస్టు చేయడం గమనార్హం. అమెరికా జార్జియాలోని టాప్ 10 మోస్ట్
వాంటెడ్ నేరస్థుల జాబితాను రాక్‌డేల్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ అధికారులు ఇటీవల
విడుదల చేశారు. హత్యలు, సాయుధ దోపిడీ, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాలకు
పాల్పడిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఈ లిస్ట్‌ను ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్
చేశారు. అయితే, ఇందులో తన పేరు లేదని గుర్తించిన క్రిస్టఫర్ స్పాల్డింగ్ అనే
నేరస్థుడు ‘మరి నా సంగతి ఏంటి?’ అని ఆ పోస్ట్‌పై కామెంట్ చేశాడు.
దీనిపై స్పందించిన పోలీసులు.. ‘నువ్వు చెప్పింది నిజమే. నీ మీదా రెండు
వారెంట్లు ఉన్నాయి. వస్తున్నామని రిప్లై ఇచ్చారు. అన్నట్లుగానే మరుసటి రోజే
అతన్ని అరెస్టు చేశారు. ‘నిన్ను పట్టుకోవడంలో నీ సహాయాన్ని అభినందిస్తున్నామని
అతని ఫొటోతోసహా ఫేస్బుక్లో వ్యంగ్యంగా మరో పోస్ట్ పెట్టారు. నేరస్థుల
జాబితాలో లేనంత మాత్రాన వారి గురించి వెతకడం లేదని అర్థం కాదని అందులో
పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ఇటీవలి
కాలంలో నేను చూసిన అత్యంత హాస్యాస్పద విషయం ఇదేనని ఓ నెటిజన్ కామెంట్
చేశారు. ‘ఇది నిజమేనా..? ఒకసారి చెక్ చేస్తా ఆగండని మరొక ఇంటర్నెట్ యూజర్
పేర్కొన్నారు.