ఎం.డి.జాని పాషా ఎన్నిక
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని ప్రయత్నం
కొనసాగిస్తాం :ఎం.డి.జాని పాషా
విజయవాడ : అక్టోబర్2వ తేదీ నాటికి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి నాలుగు
సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మరోసారి జగనన్నకు వందనం పేరిట
ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలుపుతూ అన్నీ జిల్లాల్లో కార్యక్రమం
నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్
రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా వెల్లడించారు. ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్
రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ
ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు
నిర్వహించారు. ఎం.డి.జాని పాషా ప్యానల్ కు చెందిన 21 మంది సభ్యులు ఏకగ్రీవంగా
కార్యదర్శిగా పుట్టి.రత్నం, ఉపాధ్యక్షులుగా యస్.హరి,కె.రామకృష్ణా
రెడ్డి,జి.హరీంద్ర,పి.జె.గణేష్ కుమార్, కోశాధికారిగా
బి.పుల్లారావు,కార్యనిర్వాహక కార్యదర్శులుగా యస్.కె. మహబూబ్ సుభాని, టి.
కోటేశ్వరరావు, కార్యదర్శులుగా ఎం.శాంతి సాగర్,డి.సురేష్ బాబు,కె.విజయ్ మోహన్,
బి.శ్వేతా, సంయుక్త కార్యదర్శులుగా పి.సామ్ యేలు, టి.తిరుమలయ్య,
పి.హనుమేష్,కె.మురళీకృష్ణ, ప్రచార కార్యదర్శులుగా ఎం.ధనశేఖర్,ఆర్.జాన్
పృడెంట్,కార్యనిర్వాహక సభ్యులుగా టి.దీక్షిత్, ఎం.కోటేశ్వరరావు ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా
మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని ప్రయత్నం కొనసాగించి
ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా ప్రయత్నం చేస్తామని,సచివాలయ అక్రమ సస్పెన్షన్లు
తీసివేయాలని, అలాగే సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యలు, విధుల్లో చేరిన నాటి
నుండి నోష్నల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని, యూనిఫామ్ తొలగించాలని, ప్రొబేషన్
9నెలలు ఆలస్యంగా డిక్లేర్ అయిన కారణంగా అరియర్స్ చెల్లించాలని, సచివాలయ
ఉద్యోగులందరికీ ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని, రికార్డు అసిస్టెంట్ పేస్కేల్
ను తొలగించి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు చేయాలని,గ్రేడ్-5 పంచాయతీ
కార్యదర్శులకు పూర్తి స్థాయి పాలనా బాధ్యతలు కల్పించాలని దీనికి గాను జి.ఒ
నెంబర్ 149 అమలు చెయాలని,వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు యూజర్
చార్జీల కలెక్షన్ నుండి విముక్తి కల్పించాలని, ఇతర సచివాలయ ఉద్యోగుల మాదిరిగా
పనివేళలు కల్పించాలని,వార్డు విద్యా కార్యదర్శులకు విద్యాశాఖలో ప్రమోషన్
ఛానల్స్ కల్పించాలని,వార్డు అడ్మిన్ సెక్రటరీలకు పాలనా బాధ్యతలు అప్పగించాలని,
రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు అదనంగా సహాయకుడిని నియమించాలని ఇతర
అన్నీ విభాగల సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి
విన్నవించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు యన్.చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమావేశంలో
వారికి దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలు అన్నీ ప్రభుత్వంతో మాట్లాడి
పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి.శ్రీనివాస రావు
మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎ.పి.యన్.జి.ఓ సంఘం తరపున పూర్తి
స్థాయిలో అండగా ఉంటామని ప్రతి సమస్య పరిష్కారం కోసం ఎల్లవేళలా సహాయ సహకారాలు
అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిధిగా పాల్గొన్న పశ్చిమ
కృష్ణా జిల్లా యన్.జి.ఓ అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ సంఘం ఆవశ్యకత
ఉద్యోగులు విధి నిర్వహణలో పాటించాల్సిన బాధ్యతల గురించి కూలంకషంగా వివరించారు.