త్వరలోనే శాకుంతలం రిలీజ్ డేట్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈమధ్యనే “యశోద” సినిమాతో మంచి విజయాన్ని
సాధించింది. తాజాగా ఇప్పుడు సామ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో
“శాకుంతలం” అనే సినిమాతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఇక సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ సన్నాహాలు
చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల అనుకున్న తేదీకి సినిమాను విడుదల
చేయలేకపోతున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే
కొత్త రిలీజ్ డేట్ను వెల్లడిస్తామన్నారు. “శాకుంతలం” అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల, దుశ్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా ఒక మైథలాజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు
రానుంది. శకుంతల పాత్రలో సమంత కనిపించనుండగా, దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు
దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా ఈ సినిమాలో నటిస్తుండగా,
ప్రకాష్ రాజ్, అదితి బాలన్, అనన్య నాగల్ల, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్
తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.