నాగచైతన్య కోసం మరో కథ సిద్ధమైంది. ఆ కథకి సంబంధించిన చర్చలు ప్రస్తుతం
కొనసాగుతున్నాయి. అన్నీ కుదిరితే మరో కొత్త కలయికలో సినిమాకి రంగం
సిద్ధమైనట్టే. నాగచైతన్య త్వరలోనే చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా
కోసం రంగంలోకి దిగుతారు. దానికి సమాంతరంగానే చైతూ మరో సినిమాలోనూ నటించే
అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అందుకోసం రామ్ అబ్బరాజు కథని సిద్ధం చేశారు.
ఇటీవల ‘సామజవరగమన’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడే రామ్ అబ్బరాజు,
కామెడీపైన, మాస్ అంశాలపైన ఆయనకున్న పట్టు పరిశ్రమని ఆకట్టుకుంది. నాగచైతన్య
రామ్ అబ్బరాజు కలయికలో ఓ సినిమాని నిర్మిచేందుకు ఏషియన్ సంస్థ అధినేత సునీల్
నారంగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కథాచర్చలు ఓకే ఈ కలయికలో సినిమా కుదిరినట్టే
అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి కొత్త కాంబో కుదురుతుందో లేదో
మరి.