ఒకేసారి 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు రైళ్లను జెండా ఊపగా
మరో మూడింటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశంలోని 9 నగరాల
మధ్య మరో 5 వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్
రాజధాని భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో
భోపాల్-ఇందోర్, భోపాల్-జబల్పుర్ వందేభారత్ రైళ్లను జెండాఊపి
ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ధార్వాడ్-బెంగళూరు, రాంచీ-పట్నా,
గోవా-ముంబయి వందేభారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ
కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్
మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు నరేంద్ర
సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. వందేభారత్
రైళ్లతో మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలకు రైలుప్రయాణం
మరింత మెరుగవుతుందన్నారు. ఒకేరోజు ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించటం ఇదే
తొలిసారి అని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి