కౌలాలంపుర్ : మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్ రాష్ట్రంలో గురువారం నియంత్రణ
కోల్పోయి కూలిన ఓ బుల్లి విమాన ప్రమాదం 10 మంది దుర్మరణానికి కారణమైంది.
ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితోపాటు.. విమానం కూలిన హైవేపై ఆ సమయంలో
ద్విచక్రవాహనంపై, కారులో వెళుతున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో
మృతిచెందినట్లు సెలంగోర్ పోలీస్ చీఫ్ హుసేన్ ఒమర్ఖాన్ వెల్లడించారు.
సుబాంగ్ విమానాశ్రయంలో దిగాల్సిన ఈ ప్రయివేటు ఛార్టర్డ్ విమానం ల్యాండింగుకు
కొద్ది నిమిషాల ముందు గతి తప్పి షా ఆలం జిల్లా హైవేపై కూలిపోయింది. సామాజిక
మాధ్యమాల ద్వారా వైరల్ అయిన వీడియోల్లో ప్రమాదస్థలిలో మంటల్లోంచి నల్లటిపొగ
పైకిలేస్తూ కనిపించింది.