రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ని కలిసిన హెల్త్
అసిస్టెంట్స్
విజయవాడ : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కి ఇఫ్టూ
ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్స్ వినతి పత్రం అంద చేశారు. రాష్ట్ర
ప్రభుత్వంలోని వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్
అసిస్టెంట్స్ ఫిమేల్స్ తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ
ఐ.ఎఫ్.టి.యు.ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరిలోని రెయిన్ ట్రీ విల్లాస్ లో
రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గారిని కలిసి వినతి పత్రం
సమర్పించారు. గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మహిళలనే చులకనభావంతో
ఎటువంటి ప్రమోషన్ ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే శాఖలోని పురుషులు
తమకంటే జూనియర్లు ఐనప్పటికీ ప్రమోషన్ పొందారనీ, తమకు అవకాశం కల్పిచలేదని
తెలియజేశారు. కావున తమకు సీనియార్టీ ప్రకారము ప్రమోషన్స్ కల్పించాలనీ, వీలు
కానీ పక్షంలో రెండు, మూడు సచివాలయాలకు ఒక సూపర్వైజర్ క్యాడర్ లో తమకి
ప్రమోషన్ కల్పించాలని కోరారు. సీనియర్లమై ఉండి కూడా సచివాలయ ఏఎన్ఎంల కంటే
చులకనగా డబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో మహిళలకు, చిన్న
పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి
-ప్రజలకు మధ్య తాము వారధిగా పనిచేస్తున్నామని వారు వివరించారు. అటువంటి తమ
పట్ల చిన్నచూపు చూడటం తగదని వారు పేర్కొన్నారు. రీడిప్లాయ్ మెంట్ పేరుతో తమను
150 నుంచి 200 కిలోమీటర్ల దూరం డిప్యూటేషన్ పంపించారని దీనివల్ల అనేక రకాల
సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి
చేశారు. 24-05- 2023న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 399 ప్రకారం అన్ని
డిపార్ట్మెంట్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ కిఅవకాశం కల్పించారనీ, కానీ మల్టీపర్పస్
హెల్త్ అసిస్టెంట్స్ కి కేవలం మ్యూచువల్( పరస్పర) బదిలీలకు మాత్రమే
అనుమతిచ్చారని ఇది సరైంది కాదనీ, అన్ని ప్రభుత్వ శాఖల్లో వలె తమకు కూడా జనరల్
ట్రాన్స్ఫర్స్ కి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను సావదానంగా
విన్న వాసిరెడ్డి పద్మ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి
కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ బృందంలో ఐ.ఎఫ్.టి.యు. అనుబంధ ఏపీ ప్రగతిశీల
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు యు.
వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు కె.శిశీల్యమ్మ, రాష్ట్ర నాయకులు యు.
చిన్నమ్మ, ఎస్. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.