న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా వ్యాప్తికి
ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని వైద్యరంగ
నిపుణలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా
వ్యాపిస్తుండటం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం
పెరుగుతున్నాయి. అటు మరణాలు కూడా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24
గంటల వ్యవధిలో 6,155 మంది కొవిడ్ వైరస్ బారిన పడగా.. పాజిటివిటీ రేటు 5శాతం
దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్
వ్యాపిస్తున్న ప్రాంతాలను గుర్తించి దాని
కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.తాజా వ్యాప్తికి ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్ గా పిలిచే కొత్త
వేరియంట్ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ
వేరియంట్‌కు సంబంధించి 100కు పైనే కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గత
వేరియంట్లతో పోలిస్తే ఎక్స్‌బీబీ.1.16 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని
వైద్యరంగ నిపుణులు హెచ్చరించారు.

పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు గుర్తింపు : కొవిడ్ బారిన పడుతున్న
పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం
ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కరోనా బాధితుల్లో ఈ
పరిస్థితి కనిపించలేదని పేర్కొన్నారు. కాబట్టి కొత్త వేరియంట్ వల్లే కళ్లలో
పుసులు, దురద వస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు.
తాజా కొవిడ్ గణాంకాలు ఇలా ఉన్నాయి
* 24 గంటల్లో కొత్త కేసులు – 6,155 (మొత్తం కేసులు 4.47 కోట్లు)
* యాక్టివ్ కేసులు – 31,194 (0.07శాతం)
* 24 గంటల్లో మరణాలు – 11 (ఇప్పటివరకు మొత్తం మరణాలు 5,30,954)
* రోజువారీ పాజిటివిటీ రేటు – 5.63శాతం
* మొత్తం కోలుకున్న వారు – 4.41కోట్లు
* రికవరీ రేటు – 98.74శాతం