ఎమ్మెల్సీ పోతుల సునీత
విజయవాడ : సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ
పోతుల సునీత పేర్కొన్నారు. ఇక్కడి బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు
పుట్టించాలన్నారు ఆమె. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదని
ఆమె పేర్కొన్నారు. ధర్మానికి-అధర్మానికి, నిజానికి, అబద్ధానికి రాబోయే
రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని బీసీలను ఆమె కోరారు. సంక్షేమ పథకాలు
కొనసాగాలన్న మంచి పాలన అందాలన్నా సీఎం జగన్నే మళ్లీ సీఎంగా చేసుకుందామని,
దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు.