పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో వెల్లడి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి
సారధ్యంలోని వైఎస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రఖ్యాత పోల్
స్ట్రాటజీ గ్రూప్ సర్వే వెల్లడించిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ఆయన
పలు అంశాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై రాష్ట్రంలో 56%
ప్రజలు అనుకూలంగా ఉన్నారని సర్వే నివేదికలో వెల్లడించిందని ఆయన అన్నారు.
టీడీపీ- జనసేన పార్టీలు కలిసినా మళ్ళీ అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే
దక్కుతుందని అన్నారు.
కేంద్ర పథకాల క్రెడిట్ తీసుకునే ఆసక్తి ఏపీ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు
కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి క్రెడిట్ తీసుకునే ఆసక్తి జగన్మోహన్ రెడ్డి
సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత మాత్రమూ లేదని ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందరేశ్వరి గ్రహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక కేటగిరీ స్టేటస్, రైల్వే జోన్,
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ సంస్థగానే కొనసాగించడం,
పోలవలం ప్రాజెక్టు పూర్తి చేయడం, చెన్నై-వైజాగ్ కారిడార్, రైతులకు మద్దతు
పెంపు మెదలగునవి త్వరితగతిన మంజూరు చేసేలా చూడాలని కోరారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్న సిపాయిలు వలంటీర్లు
ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్న సిపాయిలు వలంటీర్లని విజయసాయి రెడ్డి
కొనియాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలందించే డెలివరీ
సిస్టంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతికి
ఆస్కారం లేకుండా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే క్రమంలో
సైనికుల్లా పని చేస్తున్నారని అన్నారు. వలంటీర్ వ్యవస్థలో ప్రజల ముంగిటకే పాలన
వచ్చిందని అన్నారు.
దేశం గర్వించే రీతిలో ఇస్రో శాస్త్రవేత్తల చంద్రయాన్-3 ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు
దేశానికే గర్వకారణమని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రయోగం విజయవంతంగా
పూర్తవుతుందని, చంద్రుడిపై సాఫీగా ల్యాండ్ అవుతుందని, ప్రపంచంలో ఈ ఘనత
సాధించిన నాల్గవ దేశంగా ఇండియా అవతరిస్తుందని గట్టిగా నమ్ముతున్నానని అన్నారు.
ఈ మిషన్ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికకీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని
విజయసాయి రెడ్డి అన్నారు.