రూ.13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో మహాలక్ష్మికి అలంకరణ
కడియం : శ్రావణ శుక్రవారం..వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు దేదీప్యమానంగా
వెలిగిపోతోన్నాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు
నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ
తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ నిర్వాహకులు సుమారు రూ.13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను
ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున
భక్తులు తరలివచ్చారు. కడియపులంక ముసలమ్మ వారికి రూ.31.25 లక్షల నోట్లతో అలంకరణ
: మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం
సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మ
వారి ఆలయాన్ని రూ. 31 .25 లక్షల నోట్లతో అలంకరించారు. ప్రస్తుతం చాలామణిలో
ఉన్న అన్ని రకాల కొత్త నోట్లను అంటే రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై,
వంద,రెండొందలు,అయిదొందలు వినియోగించి ఈ అలంకరణ అద్భుతంగా చేశారు.అలాగే
బ్యాంకుల ద్వారా కొత్త నాణేలు కూడా తీసుకుని అలంకరించారు.మూడు రోజుల పాటు
ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేసారు. సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర
వేడుకలను ఈ ఆలయ కమిటీ వారు విన్నూత్న రీతిలో జరుపుతూ తెలుగు రాష్ట్రాలలో
ప్రత్యేకతను చాటుకుంటూ వార్తలకు ఎక్కుతారు. ఆ విధంగానే ఈ అమ్మవారిని ధనలక్ష్మి
అమ్మవారిగా అలంకరణకు లక్షలాది రూపాయల నోట్లను వినియోగించడం అందర్నీ
ఆకట్టుకుంటుంది.భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి నిత్య అలంకరణ చేసే రమేష్ కుమార్ శర్మ,
ధవళేశ్వరం శివాలయం అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేపట్టారు.