4 వ విడతలో రూ.33.12 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన ఎంపి విజయసాయిరెడ్డి
మంగళగిరి : మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాలుగో విడత వైయస్సార్ ఆసరా పథకం కింద రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెక్కులను పంపిణి చేశారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మంగళగిరి పాత బస్టాండులోని అరవింద్ హైస్కూల్ పక్కన గ్రౌండ్ లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు. నాలువ విడత కార్యక్రంలో బాగంగా కార్పొరేషన్ పరిధిలోని 3,511 గ్రూపులకు రూ. 33.12 కోట్ల చెక్కులను పంపిణి చేశారు.మొత్తం నాలుగు విడతలుగా రూ.132 కోట్లను కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు పంపిణీ చేశారు. దీని ద్వారా 3500లకు పైగా గ్రూపులకు ఈ పధకం ఆసరాగా నిలచింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త గండి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కమిషనర్ నిర్మల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.