మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
15 రోజుల్లో 108 మంది ఆకతాయిలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్
హైదరాబాద్ : బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు మంగళవారం రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.
రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 108 మందిని (మేజర్స్-67 , మైనర్స్ -41)* షీ టీమ్స్ అరెస్టు చేసినారు. వారికి ఎల్బి నగర్ CP Camp office (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు )లో కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గత నెల 16 నుండి 31 వరకు 133 పిర్యాదులు అందినాయని, రాచకొండ మహిళ రక్షణ విభాగం అధిపతి టి. ఉషా విశ్వనాథ్, డి.సి.పి, గారు తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు.
అందిన ఫిర్యాదులలో..
ఫోన్ల ద్వారా వేదించినవి -29 ,
WhatsApp కాల్స్ & messages ద్వారా వేదించినవి – 18
Social media apps ద్వారా వేదించినవి- 32
నేరుగా వేదించినవి – 54.
వాటిలో క్రిమినల్ కేసులు-5, పెట్టి కేసులు- 68, మరియు 38 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన కేసులు కొన్ని…
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్టు
నేరెడ్ మెట్ లో నివాసం ఉంటున్న యువతి తను చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ ప్రేమ పేరుతో ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పడంతో, ఆమె అతనిని నమ్మింది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి పెళ్లి సాకుతో ఆమెతో బలవంతంగా లైంగికంగా వేధించాడు. అతనిని పెళ్లి గురించి అడిగినప్పుడు, తనపై ఆసక్తి లేదని, అతను పెళ్లి చేసుకోనని చెప్పి, ఆమె నంబర్‌ను బ్లాక్ చేసి మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అట్టి విషయంపై బాధితురాలు షి టీమ్ కుషాయిగూడ నీ ఆశ్రయించగా అతనిపై సెక్షన్ 376(2)(n), 417, 420 IPCలో నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుదిని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది.
ప్రేమ పేరుతో బాలిక పై అఘాయిత్యం
ఒక వ్యక్తి స్నేహితుల ద్వారా మైనర్ బాలిక తో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నాను అంటూ మాయమాటలు చెప్పి, బాలిక పై పలుమార్లు అఘాయిత్యం చేసి, అతడి దగ్గర ఉన్న బాలిక ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ బాలికకు పంపుతూ బెదిరింపులకు పాల్పడటంతో, విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు షీ టీమ్స్ ఇబ్రహీంపట్నం ను సంప్రదించగా, అతనిపై సెక్షన్స్ 376(2)(n), 506 IPC మరియు సెక్షన్ 5(l), r/w 6 of POCSO Act 2012 క్రింద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది.
మైనర్ ని ప్రేమ పేరుతో వేదిస్తున్న స్విమ్మింగ్ కోచ్..
బోడుప్పల్ లో నివాసం ఉండే ఫిర్యాదురాలు కుమార్తె పదవ తరగతి చదువుతోంది. అదే స్కూల్ లో స్విమ్మింగ్ కోచ్ ఒక సంవత్సరం నుండి బాలికను ప్రేమ పేరుతో వేధించడంతోపాటు స్నాప్ చాట్(snapchat) యాప్‌లో మెసేజ్‌లు పంపుతు తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలిని బెదిరించాడు. అంతే కాకుండా ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక మల్కాజిగిరి షీ టీంని సంప్రదించగా వెంటనే స్పందించి మేడిపల్లి PS నందు అతనిపై సెక్షన్స్ U/s: 354(D), 506 IPC 12 of POCSO Act 2012 క్రింద మేడిపల్లి పిఎస్ నందు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది.
అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి అరెస్టు
చౌటుప్పల్ లో నివాసం ఉంటున్న యువతికి ఆమె స్నిహితుడు, చనువుగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తూ బలవంతంగా/ ఆమెకు తెలియకుండ ఫోటోలు తీస్తున్న యువకుడిని, అక్కడే మాటువేసి ఉన్న చౌటుప్పల్ షీ టీం ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నందు పెట్టి కేసు నమోదు చేశారు.
ఆగిన బాల్య వివాహం (Child Marriage):-
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందడంతో భోన్ గిరి షీ టీం వెంటనే స్పందించి DCPU( జిల్లా బాల-బాలికల సంరక్షణ విభాగం) అదికారులతో సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా మైనర్ బాలిక (17 సంవత్సరాలు)కు ఆమె కుటుంబ సభ్యులు, 23 సంవత్సరాల వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరం అని వారికి అవగాహన కల్పించి, బాల్య వివాహాన్ని అడ్డుకొని, మైనర్ బాలికకు బాల్య వివాహం నుంచి విముక్తి కల్పించడం జరిగింది.
అవగాహన కార్యక్రమం
గత నెల 16-31 వరకు షీ టీమ్స్ రాచకొండ 50 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 8850 మందికి మహిళా చట్టాలు, వారి యొక్క హక్కులు మరియు నేరాల గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది.
మెట్రో-రైల్ డెకాయ్ ఆపరేషన్..
రాచకొండ షీ టీమ్స్ మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్సు నిర్వహించి, మహిళా కంపార్మెంట్‌లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న (04) మందిని పట్టుకుని మెట్రో స్టేషన్ అదికారుల ద్వారా ఫైన్ వేయించడం జరిగింది.
డెకాయ్ ఆపరేషన్…
షీటీమ్ కుషాయిగూడ, కుషాయిగూడ ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రోడ్డు మీద వెలుతున్న మహిళను, ఆడపిల్లలను వేధీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న 16 మంది పోకిరిలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది. అలాగే ఎల్బి నగర్, వనస్థలిపురం మరియు మల్కాజ్ గిరి ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మహిళను, ఆడపిల్లలను వేదిస్తు ఇబ్బందులకు గురిచేస్తున్న 22 మంది అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది.
ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన మరియు సామాజిక మాద్యమాల ద్వారా జరిగే దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే SHE Teams ని , Rachakonda WhatsApp నెంబర్ 8712662111 ద్వారా , లేదా ప్రాంతాల వారిగా Bhongir area- 8712662598,
Choutuppal area – 8712662599,
Ibrahimpatnam area -8712662600,
Kushaiguda area -8712662601,
LB Nagar area -8712662602,
Malkajgiri area -8712662603
Vanasthalipuram area -8712662604 నెంబర్ల ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళ రక్షణ విభాగం డి.సి.పి శ్రీమతి టి. ఉషా విశ్వనాథ్, ACP వెంకటేశం, Inspectors ఎస్. దవేందర్ , పి.పరశురాం, అడ్మిన్ ఎస్ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది కౌన్సిలర్స్ పాల్గొన్నారు.