మహిళా సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట
మహిళా సాధికారత అమలులో దేశంలోనే ఏపీ టాప్
జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి మహిళకు వివరించాలి
పార్టీ మహిళా విభాగ సమావేశంలో అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి
గుంటూరు : జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పూర్తి మద్దతు ఉందని, వారి సహకారంతోనే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లి లో గురువారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు పోతుల సునీత, రుతు కళ్యాణి నేతృత్వంలో రాష్ట్ర కమిటి సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మహిళా సాధికారత అమలు చేసినట్లు తెలిపారు.
కులాలు మతాలకు అతీతంగా మహిళా సాధికారతకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. మహిళలకు ఉద్దేశించి రూపొందించిన అన్ని పథకాలూ మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికేనని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని, దేశ స్థూల ఉత్పత్తి అభివృద్దికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అభివృద్దిలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలన్నదనే సీఎం జగన్ ఉద్దేశ్యమన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. మొత్తం జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు వారికి 30 శాతం కన్నా 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రధాని కలిసిన ప్రతిసారీ మహిళా సాధికారత, రిజర్వేషన్లు గురించి ప్రస్థావించడంతో కల సాకారమయ్యిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాలుగా వివిధ పథకాల కింద ఆర్థిక తోడ్పాటు అందించారని అన్నారు. డీబీటీ ద్వారా 3,43,02,005 మహిళా లబ్దిదారులు రూ.95,867 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 30,76,018 మందికి రూ.75,670 కోట్లు ఆర్థిక సహకారం అందించారని అన్నారు. ఈ గణాంకాలు మహిళలపై జగన్ ప్రభుత్వం చిత్తశుద్దికి అద్దం పడుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం, విద్య, వైద్యం, రక్షణ కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. నవరత్నాలు కింద 2023 బజ్డెట్ లో మొత్తం రూ.27697 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 30 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, స్వేచ్ఛా కార్యక్రమం, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న బడుగు వికాశం మహిళలకు అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు.
వైసీపీతోనే కాపులకు న్యాయం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేస్తం పథకం కింద సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాల్లో రూ.75 వేలు మొత్తం 357844 మంది మహిళల ఖాతాల్లో రూ.2028.77 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు ఏమి చేశారో చెప్పలేకపోయారని అన్నారు. వైఎస్సార్ హౌసింగ్ స్కీం కింద 3076018 మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారని అన్నారు. అలాగే వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 41770406 మంది మహిళా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో 55.1 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో దిశ చట్టం పగడ్బంధీగా అమలు చేయడంతో గతంలో కంటే మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మహిళలపై నేరాలు 2019లో 67.09 శాతం ఉండగా, 2020లో 65 శాతానికి తగ్గినట్ల తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ఎస్) డేటా ప్రకారం రాష్ట్రంలో మహిళలపై లింగ వివక్ష, హింస 43.04శాతం నుండి 30 శాతానికి తగ్గినట్లు తెలిపారు.
జాతీయ స్థాయికి మించి ఏపీలో బాలికల ఎన్ రోల్ మెంట్ : మాధ్యమిక విద్యా స్థాయిలో బాలికల ఎన్రోల్మెంట్ జాతీయ స్థాయిలో 79.04 ఉండగా ఏపీలో 84 ఉందని అన్నారు.దేశంలో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఏపీ ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళల్లో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని, మహిళా కార్మికులు భాగస్వామ్యం 10.86శాతం పెరిగిందని అన్నారు. వైకాపా హయాంలో మహిళల కోసం రూ.12628 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళలకు వైకాపా ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర పార్టీలు ఇవ్వడం లేదని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహిళల సపోర్టుతో వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. గతంలో నామినేటెడ్ పోస్టులు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేని వారికి ఈ సారి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న మంచి, లబ్దిని జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని కోరారు. సమావేశాలకు లబ్ధి పొందుతున్న వారందరికీ అలాగే తటస్థులను ఆహ్వానించాలని సూచించారు.పార్టీ రూపొందించిన బ్రోచర్స్ పంపిణీ చేయాలని కోరారు. కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు, నంద్యాల, కోనసీమ, ఏలూరు, ప్రకాశం. వెస్ట్ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి మహిళా కమిటీలు ప్రకటించారని, తిరుపతి త్వరలో ప్రకటిస్తారని అన్నారు. కృష్ణా , అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు , చిత్తూరు, సత్యసాయి, విశాఖ, అన్నమయ్య జిల్లాల కమిటీలు ప్రకటించాల్సి ఉందని అన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఈస్ట్ గోదావరి, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాలు పూర్తి చేయాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.