ఎన్ టీ ఆర్ జిల్లా : మహిళలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించినప్పుడే
ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతామనే ఉద్దేశంతో మహిళల ఆరోగ్య
సంరక్షలంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.
ఢిల్లీరావు అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్తీ ఉమెన్ హెల్తీ ఇండియా నినాదంతో
నిర్వహించిన సైకిల్ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆదివారం ఉదయం పాత
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు
సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడం ద్వారా మరింత ఆరోగ్యవంతమైన సమాజం
ఏర్పడేందుకు దోహదపడుతుందన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ దృష్టి
పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మన పూర్వికులు
కాయకష్టం కుటుంబ పనులు వంటివి చేయడం ద్వారా దృఢమైన ఆరోగ్యాన్ని
కలిగిఉండేవారన్నారు. ప్రస్తుతం మారుతున్నా కాలానికి అనుగుణంగా దయానందిక
జీవితంలో ఎటువంటి పని చేయాలన్న మహిళలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వినియోగించడం
వలన శారీరక వ్యాయామం లభించక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి అనారోగ్యాలకు
అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారన్నారు.
మహిళలు నిత్య జీవితంలో తాను ఎంచుకున్న కుటుంబ బాధ్యత తో పాటు పోటీతత్వం పెరిగి
ఒత్తిడికి గురి కావడం వలన శారీరక మార్పులు చోటు చేసుకోవడం ద్వారా మెనోపాజ్
వంటి లక్షణాలతో అనేక ఇబ్బందులను ఎదురుకుంటున్నారన్నారు. కౌమార దశ నుండే
సంపూర్ణమైన పౌష్టికాహారం అందించడం ద్వారా ‘భాలికలలో ఆరోగ్యవంతమైన ఎదుగుదలతో
చెల్లిగా, భార్యగా, తల్లిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు
ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం దేశ ప్రగతికి బాటలు
వేస్తుందన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి అంగన్వాడీ
కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థినిలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని
అందజేయడంతో పాటు రక్తహీనత నివారించేందుకు ఐరన్ టాబులెట్లను పంపిణీ చేసి వాటిని
సద్వినియోగం చేసేలా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అనీమియా తో బాధపడే
చిన్నారులను, మహిళలను గుర్తించి వారి ఆరోగ్య పరిరక్షణపై వైదులు ప్రత్యేక
శ్రద్ధ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి వైద్యాధికారులు ప్రతి కుటుంబాన్ని
సందర్శించి మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాల
వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య సహాయం వాదించడడంతో పాటు ఉచితంగా
మందులను పంపిణీ చేస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, స్వయం
సహాయక బృందాల మహిళలు ద్వారా ఆరోగ్య రుగ్మతలతో బాధపడే వారిని గుర్తిచి వారికి
అవసరమైన వైద్య సహాయం అందించడం తో పాటు యోగా, వ్యాయామం వంటివి అవలంభించేలా
మహిళలను చైతన్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళను ఆరోగ్యం పట్ల
చైతన్యవంతులను చేసేందుకు హెల్తీ ఉమెన్ హెల్తీ ఇండియా నినాదంతో సైకిల్ ర్యాలీని
నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు.