ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి. మంజులా
దేవివిజయవాడ : మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ శాంక్షన్
చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి.
మంజులా దేవి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆమె
జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంజులా దేవి మాట్లాడుతూ మా అక్క
చెల్లెల్లు అన్న పదంతో రాష్ట్రంలో గవర్నమెంట్ నర్సులంతా సొంత అన్నగా
భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా
సంతోషంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నామన్నారు. అదేవిధంగా
అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాట ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తున్న చివరిగా మా
నర్సులవిన్నపం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం అని, ప్రభుత్వ ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలలో నలుగురు స్టాఫ్ నర్సులను నియమించాలని, వైద్య ఆరోగ్యశాఖలో
పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ శాంక్షన్
చేయాలని , కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్
రిక్రూట్మెంట్ చేసి నర్సుల్ని నియమిస్తూ ఉండాలని కోరారు.