‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ స్థాయిలో గుర్తింపు పొందారు రాజమౌళి. దీంతో ఆయన
తర్వాత మూవీ ఏ స్థాయిలో ఉండబోతుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు . మహేష్ బాబు హీరోగా ఓ అడ్వెంచర్ డ్రామా తీయబోతున్నట్టు
ఇప్పటికే ప్రకటించారు రాజమౌళి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు
జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ
ప్రాజెక్టు అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ కోసం అజయ్
దేవగన్ ను తీసుకున్న జక్కన్న మహేష్ మూవీలో కీలక పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్
స్టార్స్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా
ఆయన అడగాలే కానీ ఆమీర్ ఖాన్ మొదలు రణ్వీర్ కపూర్ వరకూ ఏ బాలీవుడ్ హీరో అయినా
ఓకే చెబుతారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు స్టార్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్న
మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం మూడు నెలలు మిక్సుడ్ మార్షల్ ఆర్ట్స్‌లో
స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. మొత్తానికి మరో హాలీవుడ్ రేంజ్ సినిమా
చేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు రాజమౌళి.