సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ
చిత్రం విడుదల అయి దాదాపు పదిహేనేళ్లు పూర్తవుతున్నా ఈ సినిమా క్రేజ్ అంతా
కాదు. అప్పట్లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ అందుకోవడమే
కాక కుటుంబాల అందరిని థియేటర్లకు కూడా రప్పించింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన
అంజలి నటించగా మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ ఎలా సెట్ అయిందని విషయం
చాలామందికి తెలియదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అప్పటి సంగతులు ఈ సినిమా
నిర్మాత దిల్ రాజు పంచుకున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎవరితో చేయాలనే విషయం
మీద ముందు క్లారిటీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికే కొత్త బంగారులోకం
సినిమాతో హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ఈ కథ లైన్ రాసుకుని తన దగ్గరకు వచ్చి
ఎవరైనా అప్ కమింగ్ హీరోలతో ఈ సినిమా చేద్దామని అంటే అప్ కమింగ్ హీరోలతో కాదు
ఎస్టాబ్లిష్ అయిన టాప్ హీరోలతో చేస్తే సినిమా బాగా వర్కౌట్ అవుతుందని
చెప్పానని అన్నారు.
అప్పటికే వెంకటేష్ , కథ చెబితే చేయడానికి సిద్ధమని అన్నారని మరో హీరో
కోసం వెతుకుతున్న సమయంలో ఆశ్చర్యకరంగా మహేష్ బాబు స్వయంగా తనకు మెసేజ్ చేశారని
దిల్ రాజు చెప్పుకొచ్చారు. మహేష్ బాబు తాను చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా
చూసి ఎంజాయ్ సినిమా బాగుందని ఒక మాస్ హీరోతో ఇలాంటి క్లాస్ సబ్జెక్ట్ చేయడం
తనకు నచ్చిందని చెబుతూ మెసేజ్ చేశారని ఆ మెసేజ్ కి కృతజ్ఞతగా తాను మహేష్ బాబు
ఆగడు సెట్ కి వెళ్లానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
సరదాగా ఒప్పుకుంటారో ఒప్పుకోరు అనే ఉద్దేశంతో ఇలా ఒక కథ అనుకున్నామని, చెబితే
కథ చెప్పమన్నారని విన్న వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
అలా ఈ సినిమాను ప్లాన్ చేయడం, షూట్ చేయడం ఆ తర్వాత రిలీజ్ చేయడం అన్నీ కూడా
శరవేగంగా జరిగిపోయాయని తన బ్యానర్ లో వచ్చిన ఫీల్ గుడ్ సినిమాస్ లో ఇది కూడా
ఒకటిగా నిలిచిపోయిందని ఈ సందర్భంగా దిల్ రాజు కామెంట్ చేశారు.