భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. దిల్లీ చేరుకున్న ఆయన సోమవారం ఉదయం మహాత్మా గాంధీ సహా పలువురు మాజీ ప్రధానులకు నివాళులు అర్పించారు. జనవరి 3న తిరిగి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. బిజెపి నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయీకి కూడా రాహుల్‌గాంధీ నివాళులర్పించారు.