తిరుపతి : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్
గుమ్మడి కూతుహలమ్మ బుధవారం ఉదయం స్వగహం లో మరణించారు. వృతరీత్యా డాక్టర్ గా
పని చేస్తున్న ఆమె 1978 లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా చిత్తూరు
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేయడం ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా 1985,1989,1999, 2004 ఎన్నికలలో వేపంజేరి
నియోజకవర్గం నుంచి, 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి
గెలిచారు. 1994 లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడం తో వేపంజేరి నుంచి ఇండిపెండెంట్
గా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ లో చేరాక 2014లో గంగాధర నెల్లూరు
నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. 1992-1993 మధ్య కాలంలో
నేదురుమల్లి జనార్ధన రెడ్డి మంత్రి వర్గం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా
పనిచేశారు. 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శాసన సభ డిప్యూటీ
స్పీకర్ గా పని చేశారు. తిరుపతి లోని స్వగృహం లో నిద్ర లోనే కన్నుమూసారని ఆమె
కుటుంబ సభ్యులు చెబుతున్నారు.