పెండ్లితో సినిమాల్లో జోరు తగ్గించిన సోనమ్ కపూర్ కొడుకు పుట్టాక కెరీర్ కు
కామా పెట్టింది. మళ్లీ మరో ఇన్నింగ్సుకు సిద్ధపడుతున్న సోనమ్ పదినెలలుగా తన
కొడుకుతో ప్రతిక్షణాన్ని అద్భుతంగా ఆస్వాదించానని చెప్పుకొచ్చింది. ‘ప్రతి
మహిళకు అమ్మతనం బాధ్యతతో కూడిన వరం. మాతృత్వాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని
సవాళ్లు కూడా స్వీకరించాల్సి ఉంటుంది. తాను తినే ఆహారం గురించి కూడా ఒకటికి
రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, జిహ్వచాపల్యం కొద్దీ ఏదేదో తినేస్తే, తల్లి
పాలు తాగే పిల్లాడికి ఏదైనా సమస్య రావచ్చు. అందుకే అనుక్షణం తను జాగ్రత్తగా
ఉంటూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి .అని అమ్మగా తాను తీసుకుంటున్న
జాగ్రత్తల గురించి వివరించింది సోనమ్. తల్లయిన నటికి సినిమాల్లో అవకాశాలు
తగ్గిపోతాయన్న వాదన అర్ధసత్యం అంటున్నదామె. సినిమాల్లో మాత్రమే కాదు బయట ఏ
రంగం తీసుకున్నా మహిళలు సత్తాచాటుతున్నారు. మల్టీ టాస్కింగ్ లో ఆడవాళ్లు
అగ్గిపిడుగులే! ఏకకాలంలో నాలుగైదు పనులు చక్కబెట్టగలరు అయితే గర్భిణిగా నెలలు
నిండే క్రమంలో తల్లయిన కొత్తలో ఆమె వేగం తగ్గవచ్చు. అంతమాత్రానికి స్త్రీ
శక్తిసామర్ధ్యాలు సన్నగిల్లినట్టు కాదు అని ఇండస్ట్రీలో తన పని అయిపోయిందని
కామెంట్ చేసినవారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.