వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్ (రాపూరు):-మండలం పరిధిలో నే కోటూరు పాడు గ్రామంలో మద్దూరి శ్రీనివాసులు ఎంఆర్పిఎస్ రాపూర్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవిందరంగయ్య మాదిగ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ విషయమై వాదాపు వాదనలో జరుగుతున్న సందర్భంగా మాదిగల పోరాటం న్యాయమైందని న్యాయం గెలుస్తుందని వర్గీకరణ తప్పకుండా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ప్రస్తుత వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందుతాయని ఆయన పోరాటం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు.మాదిగలు బలమైన శక్తిగా ఎదగాలని అందుకే తమ పోరాటమని స్పష్టం చేశారు.